ArticlesNews

ఒక్కడు నోరెత్తితే ఒట్టు… ఇదీ సెక్యులర్ నేతల తీరు!!

184views

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంతో ప్రారంభమైన నిరసన కట్టుతప్పి అదుపులేని హింసాకాండగా… చివరికి హిందూ వ్యతిరేక మారణకాండగా మారింది. హిందువులు, హిందువుల ఆస్తులు, హిందూ మందిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటూ ఉగ్రదాడిగా రూపుదాల్చింది. బంగ్లాదేశ్ ఇస్లామిక్ మత ఛాందసవాదశక్తుల ఈ ఘోర రాక్షసమూకదాడికి అనధికారికంగా వేలాది హిందువులు క్షతగాత్రులై, నిరాశ్రయులై, జీవచ్ఛవాలుగా మిగిలారు. వందలాది హిందువులు శవాల కుప్పలవుతున్నారు. శిలలకు సైతం కన్నీరు తెప్పించే ఆ భయానక ఆర్తనాదాల దృశ్యాలు వీడియోలను సోషల్ మీడియాలో చూసి యావత్ ప్రపంచం బాధతో స్పందిస్తోంది. కానీ, సెక్యులరిజం పేరుతో హిందువులను మాత్రమే ద్వేషిస్తూ అన్యమతాలపై అవధుల్లేని ప్రేమను కురిపించే మన దేశంలోని పలు రాజకీయ పార్టీలు, వాటి నేతలు మాత్రం ఈ పరిణామాలపై ఏమాత్రం స్పందించక తమ నక్కజిత్తుల తోడేలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు.

బంగ్లాదేశ్ హిందూ సమాజం దాడులతో అట్టుడికిపోతుంటే కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే గాని, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలు గాని స్పందించిన పాపాన పోలేదు. ఎన్నికలప్పుడు మాత్రమే హిందూ మందిరాలు, పీఠాలను సందర్శించే తల్లీ, కొడుకు, కూతురు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. అక్కడి పరిణామాలపై స్పందిస్తూ కనీసం ఒక్క ట్వీట్ కూడా ఇవ్వలేదు. గతంలో ఈ పార్టీ నుంచి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు దేశంలోని ఆస్తులపై తొలి హక్కు పేద ముస్లింలదేనని చెప్పిన ఘనుడు. కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం నేతల సంగతి ఇక సరేసరి. వీరికి బంగ్లాదేశ్ హిందువుల వేదన వినిపిస్తుందనుకోవడం హిందువుల అత్యాశ.

ఇక కమ్యూనిస్టుల విషయానికి వస్తే… సమసమాజం అంటూ సామ్యవాదంపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఈ వామపక్ష మేథావుల దృష్టిలో ప్రజలంటే దేశంలోని ఇస్లాం, క్రైస్తవ పౌరులు మాత్రమే. వారికేమైనా చిన్నపాటి బాధ కలిగితే చాలు ముందుగా కమ్యూనిస్ట్ నేతలే కుతకుతలాడిపోతారు. దేశంలోని హిందూ సమాజం బాధలు వీరికి కనిపించవు. ఇలాంటివారికి బంగ్లాదేశ్ హిందువుల వెతలు కనిపిస్తాయనుకోవడం మన దురాశ. గాజాకు గానీ, హమాస్ ఉగ్రవాదులకు గానీ ఏమైనా అయితే గగ్గోలు పెడుతూ గజగజలాడిపోతారు కానీ, ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోయినా ఫరవాలేదు.

బంగ్లాదేశ్‌ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి నిజం చెప్పాలంటే… హిందువులను ద్వేషిస్తూ ముస్లింలను మాత్రమే ప్రేమించే అసలు సిసలైన సెక్యులరిస్టు. తన రాష్ట్రంలోని సందేశ్ ఖాలీలో హిందూ మహిళలపై జరిగిన అకృత్యాలపై స్పందన లేదు, చర్యలు లేవు. టీఎంసీలోని పలువురు ముస్లిం నేతలు స్థానిక నియంతల తరహాలో నడిరోడ్డుపైనే మహిళల్ని దారుణంగా కొట్టిన వీడియోలు బయటకొచ్చినా చర్యల్లేవు. కలకత్తాలోనే ఆమె పార్టీకి చెందిన ఒక మేయర్ ప్రజలందరూ ముస్లింలుగా మారాలని బహిరంగంగా పిలుపునిచ్చినా స్పందించని మమతానురాగాలు ఆమెవి. తాను హిందూ బ్రాహ్మణ స్త్రీనని… తనకు హిందూ ధర్మం గురించి ఎవరూ చెప్పనవసరం లేదని పదే పదే చెప్పుకునే మమతా బెనర్జీకి బెంగాల్‌లో గ్రామాలకు గ్రామాలే రోహింగ్యాల అక్రమ వలసలతో నిండిపోయి హిందువులపై విద్వేష దాడులు జరుగుతున్నా ఏమీ పట్టదు. ఈమెకు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ హిందువుల ఆర్తనాదాలు వినిపిస్తాయనుకోవడం పిచ్చితనం తప్ప మరొకటి కాదు.

ఇక ఖలిస్తాన్ వేర్పాటువాదానికి పెద్దపీట వేసే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాలనలో ఉన్న దేశ రాజధాని నగరంలో హిందువులపై ఎన్ని దాడులు జరిగినా చర్యలు శూన్యం. మరోవైపు దక్షిణాదికి వస్తే తమిళనాడులో సనాతన ధర్మాన్ని వ్యాధితో పోల్చుతూ సీఎం స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో లవ్ జిహాద్‌లకు, హిందువులపై దాడులకు కొదవ లేదు. కేరళలో ప్రస్తుతం కొనసాగుతున్న వామపక్ష నేతృత్వ ఎల్‌డిఎఫ్ సర్కారు ఏ స్థాయిలో హిందువులకు సహకరిస్తుందో చెప్పాల్సిన పని లేదు. శబరిమల అయ్యప్ప క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన శక్తులకు పినరయి సర్కారు ఇచ్చిన చేయూత అందరికీ తెలిసిందే… వీళ్లందరికీ బంగ్లాదేశ్ హిందువుల ఆర్తనాదాలు వినిపిస్తాయని భావిస్తున్నారా?…

చివరాఖరిగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలోని గత వైసీపీ సర్కారు హయాంలో హిందువుల పరమపుణ్యక్షేత్రమైన తిరుమలలో జరిగిన దోపీడీ గురించి ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా దాఖలాలు బయటపడుతున్నాయి. అంతర్వేది రథం కాలిన అంశం… విజయవాడ దుర్గగుడి రథం నుంచి వెండి సింహాలు మాయం కావడం… విజయనగరం జిల్లాలో రామతీర్థంలో కోదండ రాముని విగ్రహాన్ని అపవిత్రం చెయ్యడం… పాస్టర్లకు మాత్రమే పారితోషికాలివ్వడం… ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పాలనలో హిందువులకు జరిగిన అన్యాయంపై కొండవీటి చాంతాడంత జాబితా చేసుకోవచ్చు.

తెలంగాణలో కూడా గత కేసీఆర్ పాలనలో హిందువులపై జరిగిన దాడుల ఘటనలో చాలానే బయటకొచ్చాయి. ప్రధానంగా భైంసా ఒక్కటి చాలు. నేడు బంగ్లాదేశ్‌లో హిందువుల దీనస్థితిపై కేసీఆర్ గానీ, కేటీఆర్ గాని స్పందిస్తారనుకోవడం కచ్చితంగా వెర్రితనమే… తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో చోటు చేసుకున్న జైనూర్, చెంగిచర్ల ఘటనలు నేటి పరిస్థితిని చెప్పకనే చెబుతాయి. మరోపక్క హైదరాబాద్ నవాబుల్లా ఫోజులిచ్చే ఓవసీ సోదరుల హిందూ ద్వేషం గురించి లెక్కలేనంత వీడియో కంటెంట్ ఇంటర్నెట్ నిండా సర్కులేట్ అవుతూనే ఉంది. పాలస్తీనా ప్రజలు, గాజా పౌరులు తప్ప బంగ్లాదేశ్ హిందువుల దుస్థితి మాకెందుకనే తీరు వీరిది.

ఇలా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆప్, టీఎంసీ, డీఎంకే, వైసీపీ, టీఆరెస్… తదితర జాతీయ, ప్రాంతీయ పార్టీలు వేటిని తీసుకున్నా హిందువుల ఓట్లు కావాలి తప్ప హిందువుల క్షేమం అవసరం లేదు. ఈ పార్టీల నేతలు, నాయకులు చాలామంది స్వయంగా హిందువులై ఉండి కూడా స్వదేశంలోనే హిందువుల క్షేమాన్ని కాంక్షించరు. వీరి దృష్టిలో ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే మనుషులు… ఇలాంటి పార్టీలు, నేతల నుంచి బంగ్లాదేశ్ హిందువులు సానుభూతిని ఆశించడం మహాపాపం… ఘోరమైన నేరం…

బంగ్లాదేశ్ ఒకప్పుడు మన దేశ అంతర్భాగమేనని… అక్కడ మన హిందూ ధర్మం, మన సంస్కృతి మూలాలు ఉన్నాయనే స్పృహ ఈ నేతలెవరికీ లేదు. 70 ఏళ్లలో జరిగిన ఈ ఘోరానికి కారణం ఒక వర్గమని అందరికీ తెలుసు. స్వదేశంలో ఇలాంటి పరిణామాలు పెచ్చరిల్లకుండా చూడాల్సిన బాధ్యత వీరిది కాదా?… ఇలాంటి రాజకీయ నేతల వ్యాఖ్యలు, ద్వేషపూరిత ప్రసంగాలు ప్రజల్లో దేశ వ్యతిరేకత, సమాజ వ్యతిరేకతను నింపుతున్నాయి. ఇలాంచి వాటి ఫలితమే బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత.

ఈ పరిస్థితుల్లో హిందూ సమాజం తమ రక్షణకు తాముగా పూనుకోవాలి. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఏకం కావాలి… ఆ దిశగా పటిష్టమైన వ్యవస్థను నిర్మించుకుని విశ్వశ్రేయస్సును కాంక్షించే హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఇదే మన తక్షణ కర్తవ్యం.

-జి.శ్రీనివాస్ కుమార్