News

రామాలయ నవీకరణ పనుల్లో నాణ్యత పాటించాలి

56views

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో చేపట్టనున్న నవీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని భారతీయ పురాతత్వ సర్వేక్షణశాఖ రాష్ట్ర పర్యవేక్షకుడు గోపీనాద్ నా శాఖ అదికారులను ఆదేశించారు. రామయ్య క్షేత్రంలో దెబ్బతిన్న విమాన గోపురం, ప్రాకారం గోడలకు మరమ్మతులు చేయాలని రూ.57.48 లక్షలకు పాలనామోదం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాములోరి సన్నిదిలో బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం గర్భగుడి, రంగ మండపంపై నెర్రెలిచ్చిన పైకప్పు, తూర్పు, ఉత్తర, దక్షిణ, విమాన గోపురాలను అధికారులతో కలిసి పరిశీలించారు. చలువరాయి పరిచే పనుల్లో నాణ్యతపై రాజీపవొద్దన్నారు. ఒప్పంద గడువులోగా గుత్తేదారు ద్వారా పనులు వేగవంతంగా పూర్తిచేయించాలన్నారు. విమాన గోపురంపై కొన్ని శిల్పాలు కళాహీనంగా ఉన్నాయని గుర్తించామని, పూర్వాకృతి తీసుకొచ్చేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆధారాలు లభిస్తే శిల్పాలకు నూతన శోభ తీసుకొస్తామని పేర్కొన్నారు. రంగ మండపం, అంకణాల మండపంలో చెబ్బతిన్న రాళ్ల స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయాటన్నారు. శ్రీవారిపోటులో మరమ్మతులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అమరావతి ఉప పర్యవేక్షకుడు చేమేద్రనాద్ బోయి, ఏఎసీఈ భానుప్రకాష్ వర్మ వైఎస్ఆ్కర్, ప్రకాశం జిల్లాల పురావస్తుశాఖ అధికారులు బాలకృష్ణారెడ్డి, యశ్వంత్కుమార్రెడ్డి, తితిదే డీఈ నాగరాజు తదితరులు. పాల్గొన్నారు.