News

వర్ధమాన మహావీరుని శిల్పాన్ని కాపాడుకోవాలి

54views

కర్నూలు జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో, కల్లూరు మండలం, నాయకల్లు గ్రామం శివారులో నిర్లక్ష్యంగా పడి ఉన్న వెయ్యేళ్ల నాటి వర్థమాన మహావీరుని శిల్పాన్ని కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
ఊరు, వాడా, మారుమూల పల్లెల్లో అస్తవ్యస్తంగా పడి ఉన్న శిల్పాలు, శాసనాలు, శిథిలాలపై స్థానికులకు అవగాహన కల్పించే “ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పొస్టేరిటి” కార్యక్రమంలో భాగంగా, ప్లీచ్ ఇండియా బృందం నాయకల్లు గ్రామం లో, బయట నిర్లక్ష్యంగా పడి ఉన్న శిల్పాలను ఆదివారం నాడు క్షుణ్ణంగా పరిశీలించారు.

గ్రామానికి ఉత్తరంగా రోడ్డు పక్క పొదల్లో ఉన్న 24వ జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుడి శిల్పం, ఒక స్తంభం, పీఠాలను గ్రామానికి తరలించి, భద్రపరిచి, చారిత్రక వివరాలతో ఒక పేరు పలకను ఏర్పాటు చేయాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

మహావీరుని శిల్పం, ఆలయ విడిభాగాలు క్రీ.శ. 10వ శతాబ్దం నాటి రాష్ట్రకూటలకు చెందినవని, పద్మాసనంలో ధ్యానముద్రంలో కూర్చొని ఉండగా, ఎడమ కాలు తల వెనక ప్రభా మండలం భిన్నమైనాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ అధికారి, మహేంద్ర నాయుడు ప్లీచ్ ఇండియాకు చెందిన జితేంద్ర, చరణ్, శ్రీహరి, హరీష్, ఉదయ్ కిరణ్, దుర్గ, మైత్రేయి, కౌస్తుభ్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.