News

బయటపడిన మహా విష్ణువు ఆలయం

44views

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తిరుమూరులో చెట్ల మధ్యలో ఉన్న 300 ఏళ్ల నాటి పురాతన మహా విష్ణువు ఆలయం బయటపడింది. ఈ వైష్ణవ ఆలయం బ్రిటీష్‌ హయాంలో నిర్మించార కొందరు, పల్లవులు నిర్మించారని మరికొందరు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు చిట్టమూరు మండలం, యాకసిరి తిప్పపై ఉన్న భూపతేశ్వరస్వామి ఆలయంలో ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ ఆలయం గ్రామంలో ఎప్పుటి నుంచో చెట్ల మధ్యలో ఉందని, 250 ఏళ్ల క్రితం వరకు పూజలు జరుగుతుండేవని, ఆ తర్వాత మరుగున పడిపోయిందని పెద్దలు చెబుతున్నారు. కొందరు సాహసించి చెట్ల పొదలను తొలగించడంతో పురాతన ఆలయం వెలుగులోకి వచ్చిందని, అందులో విగ్రహం కూడా ఉందని గ్రామస్తులు తెలిపారు.