ArticlesNews

యుద్ధ వాతావరణంలోనూ మత ప్రచారం… ముస్లిం ఛాందసుల తీరిదీ

62views

యుద్ధ వాతావరణంలోనూ మత మార్పిళ్లు ఆగలేదు. యుద్ధ మేఘాలు అలుముకున్నా… మత ఛాందసులు మాత్రం మానవత్వం ప్రదర్శించకుండా… తమ మత విస్తరణే కాంక్షించారు. ఇజ్రాయిల్‌`హమాస్‌ యుద్ధ ప్రభావం కేవలం గల్ఫ్‌ దేశాలకే పరిమితం కాలేదు. అమెరికా, యూరప్‌ లాంటి దేశాలకూ విస్తరించింది. అయితే.. ఐరోపాలో మాత్రం ఈ యుద్ధ సమయంలో ఇస్లామిక్‌ మత మార్పిడి 400 శాతానికి చేరుకుంది. ఈ ఇస్లామిక్‌ మత మార్పిడికి సంబంధించి గ్లోబ్‌ఐ న్యూస్‌ తన రిపోర్టులో షాకింగ్‌ విషయాలను వెల్లడిరచింది. అక్టోబర్‌ 7 దాడి తర్వాత ఇజ్రాయిల్‌ ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం ఛాందసులు సోషల్‌ మీడియా వేదికగా ఇస్లాం మత ప్రచారాన్ని చేయడం ప్రారంభించారని పేర్కొంది.

గాజా ప్రజల ప్రతిఘటనను అర్ధం చేసుకోవడానికి చాలా మంది యూరోపియన్లు ఖురాన్‌ను అధ్యయనం చేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఈ శతాబ్దం చివరి నాటికి ఐరోపాలో ముస్లింలు ఐదో అతిపెద్ద జనాభాగా మారతారని కూడా ఓ అంచనా. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన పరిశోధన ద్వారా ఈ విషయం వెల్లడైంది. 2050 నాటికి ముస్లింల నిష్పత్తి జర్మనీలో 20 శాతం, ఫ్రాన్స్‌లో 18 శాతం, బ్రిటన్‌లో 17 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.

2019 లో పరిశోధకులు పియరీ రోస్టన్‌, అలెగ్జాండ్రా రోస్టన్‌ యూరోపియన్‌ ముస్లిం జనాభా ఎప్పుడు? ఏ దేశాలలో మెజారిటీగా మారుతుంది? అన్న అంశంపై అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనంలో తేలింది ఏమిటంటే దాదాపు 100 సంవత్సరాలల లోపే స్వీడన్‌, ఫ్రాన్స్‌ మరియు గ్రీస్‌ ఐరోపాలో మెజారిటీలుగా ముసిÊంలు మారిపోతారని వీరు అంచనా వేశారు. దీని తర్వాత సుమారు 150 సంవత్సరాలలో బెల్జియం మరియు బల్గేరియాలో కూడా ఇదే జరుగుతుందని, లక్సెంబర్డ్‌, ఇటలీ, బ్రిటన్‌లలో కూడా ముస్లింలు దాదాపు 150 సంవత్సరాలలోనే మెజారిటీలుగా మారతారని కూడా వెల్లడిరచారు.

ఇది ఇలా వుండగా… ఫ్రెంచ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఎకానమిక్‌ స్టడీస్‌ 2023 అధ్యయనంలో ఫ్రాన్స్‌ గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడైంది. 10 శాతం ఫ్రెంచ్‌ ప్రజలు తమను తాము ముస్లింలుగా చెప్పుకుంటారని, అయితే.. ఈ స్థితి 15 శాతానికి పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదని కూడా పేర్కొంది. ఇజ్రాయిల్‌`హమాస్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీనియన్ల పోరాటాన్ని అన్ని రకాల సోషల్‌ మీడియా వేదికలలో ప్రశంసించడం గమనించాల్సిన అంశం. ఇజ్రాయిల్‌ వంటి శక్తిమంతమైన దేశానికి వ్యతిరేకంగా గాజా ప్రజలు పోరాడుతున్న తీరు యూరప్‌, అమెరికాలో పెద్ద మొత్తంలో ప్రజలను బ్రెయిన్‌ వాష్‌ చేసే కార్యక్రమం జరిగింది.