News

తెలుగు సహా పలు భాషలకు క్లాసికల్ హోదా

44views

భారతీయ భాషలైన తమిళం, సంస్కృతం, కన్నడ, తెలుగు, మలయాళం మరియు ఒడియాలకు శాస్త్రీయ (క్లాసికల్) భాష హోదా లభించిందని సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. లోక్‌సభలో సభ్యుల ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ , శాస్త్రీయ భాషలతో సహా అన్ని భారతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. జాతీయ విద్యా విధానం, 2020 కూడా అన్ని భారతీయ భాషల ప్రచారంపై దృష్టి సారిస్తుందాని మంత్రి పేర్కొన్నారు.