News

పాక్‌లో పెరిగిన హిందూ జనాభా

203views

పాకిస్థాన్‌లో హిందువుల జనాభా 2017లో 35 లక్షలు కాగా 2023లో 38 లక్షలకు పెరిగిందని, పాక్‌లో అత్యధిక జన సంఖ్య గల మైనారిటీ వర్గం హిందువులేనని గతేడాది జన గణన తేల్చింది. నిరుడు పాకిస్థాన్‌ మొత్తం జనాభా 24,04,58,089 అని పాక్‌ గణాంకాల సంస్థ (పీబీఎస్‌) తెలిపింది. ఈ లెక్కన పాక్‌ జనాభా 2050కల్లా రెటింపుకానున్నది. 7వ జనాభా, గృహ గణన (2023) వివరాలను పీబీఎస్‌ గురువారం విడుదల చేసింది. దేశ జనాభాలో ముస్లింల వాటా 2017లో 96.47 శాతం కాగా, 2023లో అది స్వల్పంగా తగ్గి 96.35 శాతానికి చేరింది. క్రైస్తవుల జనాభా 1.27 శాతం నుంచి 1.37 శాతానికి (26 లక్షల నుంచి 33 లక్షలకు) పెరిగింది. అహమ్మదీయుల వాటా 0.09 శాతం నుంచి 0.07 శాతానికి తగ్గింది. పాక్‌లో సిక్కుల సంఖ్య 15,998 కాగా పార్సీల జనాభా 2,348 మాత్రమే.