News

హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికా యుద్ధవిన్యాసాలు

66views

భారత్, అమెరికాలు హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధవిన్యా సాలు నిర్వహించాయి. ఇందులో ఇరు దేశాల అగ్రశ్రేణి యుద్ధనౌకలు పాలు పంచుకున్నాయి. అమెరికాకు చెందిన విమానవాహక నౌక థియోడోర్ రూజ్ వెల్ట్ నేతృత్వంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా భాగస్వామ్యం వహిం చింది. రూజ్వెల్ట్ నౌక.. అణుశక్తితో నడుస్తుంది. పెద్ద సంఖ్యలో డిస్ట్రా యర్లు, ఫ్రిగేట్ యుద్ధనౌకలు దీన్ని అనుసరించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ విన్యాసా లకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత నౌకాదళం తరఫున గైడెడ్ మిసైల్ డిస్ట్రా యర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఇంధన ట్యాంకర్ ఐఎన్ఎస్ ఆదిత్య సహా అనేక వార్ షిప్ లు ఇందులో పాల్గొన్నాయి.