News

ప్రపంచ రక్తదాతల దినోత్సవం

29views

ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసే వారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజలలో అవగాహన పెంపొదించి… ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల మన శరీరానికి కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవ శాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతి 1868 జూన్ 14ను రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది.