ArticlesNews

సేవాధురీణ శ్రీమతి పొణకా కనకమ్మ

56views

(జూన్ 10 పొణకా కనకమ్మ జయంతి)

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వం ధారబోశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో నెల్లూరుకు జాతీయ ఖ్యాతి తెచ్చిన ధీరవనిత పొణకా కనకమ్మ. వివిధ ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లిన మహిళగా చరిత్ర సృష్టించారు. కస్తూరిదేవి విద్యాలయాన్ని నిర్వహించిన స్త్రీ విద్యావేత్త. పినాకినీ సత్యాగ్రహాశ్రమాన్ని స్థాపించేందుకు స్థలాన్ని అందించిన దాత.పొణకా కనకమ్మ స్వయంగా వివిధ భాషలను అభ్యసించి, వివిధ గ్రంథాలను తెలుగు భాషలోకి అనువదించారు. భగవద్గీతను జ్ఞాననేత్రం పేరుతో తెలుగులోకి అనువదించారు.

పొణకా కనకమ్మ 1882 జూన్ 10న పోట్లపూడి గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, రావమ్మ దంపతులకు జన్మించారు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది. పోట్లపూడి గ్రామానికి ప్రముఖులు ఎవరు వచ్చినా అప్పట్లో కనకమ్మ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళేవారు. 1913లో పోట్లపూడిలో సుజన రంజనీ సమాజ స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాలబాలికల విద్య కోసం జాతీయ పాఠశాల ఏర్పాటునకు పొణకా కనకమ్మే కారణం. పల్లెపాడులో సత్యాగ్రహ ఆశ్రమాన్ని 1921 ఫిబ్రవరి 7న మహాత్మాగాంధీతో ప్రారంభింపజేశారు.

1930లో పల్లెపాడులో జరిగిన ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో కనకమ్మ ప్రముఖ పాత్ర వహించారు. ఆమె నాయకత్వంలో మైపాడుకు భారీ స్థాయిలో మహిళలు తరలి వెళ్ళారు. 1930 జూలై 1న కనకమ్మ అరెస్టయి నెల్లూరు, పొణకా కనకమ్మ తన స్వీయచరిత్రను ‘కనకపుష్య రాగం’ పేరుతో గ్రంథస్థం చేశారు.

దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వీరవనిత పొణకా కనకమ్మ 1963 సెప్టెంబర్ 15న కన్నుమూశారు. మహిళా జాతికి వెలుగుచుక్కయిన కనకమ్మ జ్ఞాపకార్థం 2021 మార్చి 8న తపాలాశాఖ ప్రత్యేక కవరును ముద్రించి గౌరవించింది.