News

తూర్పునావికాదళం‌ ఆధ్వర్యంలో విశాఖలో బీచ్ క్లీనింగ్

68views

ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పునావికాదళం‌ ఆధ్వర్యంలో శనివారం విశాఖ పట్నంలోని బీచ్ క్లీనింగ్ నిర్వహించారు.అలాగే తీరప్రాంతం కోతకు గురికాకుండా రక్షించే మడ అడవుల పెంచేక్రమానికి నాందిపలుకుతూ మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో నేవల్ డిఫెన్స్ సివిలియన్ సిబ్బంది వారితో పాటు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.బీచ్ క్లీనప్ డ్రైవ్ భూమిపై జీవాన్ని నిలబెట్టడంలో సముద్రం యొక్క కీలక పాత్ర గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సముద్ర జీవులను హానికరమైన కాలుష్యం నుండి రక్షించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ నావికాదళం‌ అధికారులు తూర్పుతీర రాష్ట్రాలన్నింటిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నావికాదళ అధికారి ఒకరు తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్ఎస్ వీరబాహు, ఐఎన్ఎస్ సర్కార్, నేవల్ డాక్ యార్డ్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.