News

గోరక్షా చట్టాలను అమలు చేయాలి

123views

గోవధ మాఫియా ను కఠిన చట్టాలతో అణచివేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొంతమంది రాజకీయ నాయకుల ప్రోధ్బలంతో ఈ అక్రమ రవాణా జరుగుతున్నదని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గోమాఫియాను నిర్వహిస్తూ కోట్లు గడిస్తున్న వ్యాపారులను వదిలేసి దానిలో పనిచేసే వారిపై కేసుల నమోదు చేయడం మూలంగా గోవదనుసరిగా అరికట్టలేకపోతున్నారని విమర్శించారు.

మూలమైన వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని వారు పోలీసు శాఖను కోరారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను కాపాడాలని, 1977 గో చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో దేశీ గోవంశ రక్షణ సంవర్థన సమితి ఆధ్యర్యంలో ఇందిరా పార్క్ వద్ద నున్న దర్నా చౌక్ వద్ద శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ గోరక్షపై ప్రభుత్వాలు చేసిన చట్టాలను ప్రభుత్వాధికారులే నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా గోవులను అష్టానుసారం వధించడం సర్వసాధారణమై పోయిందని విమర్శించారు. గోశాలలను ఏర్పాటు చేయమని కోరుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తక్షణం ప్రతి దేవాలయంలో గోశాలలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, రావి నూతన శసిథర్, ఆకుతోట రామారావు, పరబ్రహ్మానంద స్వామీజీ, శనక సంహానంద స్వామీజీలతో పాటూ పలువురు గోరక్షకులు, గో ప్రేమికులు పాల్గొన్నారు.