
456views
తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఉదయం 8.14 గంటలకు విమానం తిరుమల మీదుగా వెళ్లింది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదని నియమం. దీనిపై గతంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లగా నిబంధన అమలు చేయడం వీలుకాదని తెలిపినట్లు టిటిడి సైతం వెల్లడించిన విషయం తెలిసిందే.





