News

నెల్లూరులో ఘ‌నంగా హ‌నుమాన్ శోభాయాత్ర‌

78views

హిందూ చైతన్య వేదిక, నెల్లూరు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా దేశ రక్షణ కోసం..ధర్మరక్షణ కోసం..అంటూ నెల్లూరులో శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ మీదగా స్టోన్‌ హౌస్‌పేటలోని ఆర్​ఎస్​ఆర్​ పాఠశాల వరకు యాత్ర సాగింది. శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను వాహనాలపై కొలువుదీర్చి ద్విచక్ర వాహనాల్లో హనుమాన్ భక్త బృందం ర్యాలీగా తరలి వెళ్లారు. నెల్లూరులో హనుమాన్ శోభాయాత్ర నా భూతో నా భవిష్యత్తుగా 20,000 మంది పై చిలుకు హనుమాన్ భక్తులతో శోభాయమానంగా జరిగింది. అడుగడుగునా ప్రజలు దీపాలతో హారతులు ఇచ్చారు. పూలవర్షం కురిపించారు. మంగళ వాయిద్యాలు, జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణ, విచిత్ర వేషధారణలు, కోలాటాలు, ఆధ్యాత్మిక గీతాలాపనలు, బాణసంచా పేలుళ్ల మధ్య హనుమాన్​ శోభాయాత్ర సాగింది. శోభాయాత్రలో పాల్లగొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శోభాయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి
నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.