News

తమిళనాడులో 18వ శతాబ్దం నాటి తెలుగు శిలాశాసనం లభ్యం

Stitched Panorama
55views

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణిలో 18వ శతాబ్దం నాటి తెలుగు శిలాశాసనం లభ్యమైంది. కోదండరామాలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కొలనులో పూడికతీత పనులు చేపడుతుండగా ఈ శిలా శాసనం వెలుగుచూసింది. దీనికి గురించి పురావస్తు పరిశోధకులు విజయన్‌ మీడియాతో మాట్లాడుతూ… 200 సంవత్సరాల క్రితం దక్షిణభారత యాత్ర కోసం కాశీ నుంచి వచ్చిన దుర్గప్రసాద్‌ స్వామీజీ ఆరణి సమీపంలో వున్న సూర్య కొలను సమీపంలో బస చేశారని, ఇక్కడి వాతావరణం నచ్చడంతో కొంతకాలం ఇక్కడే నివసించినట్టు చరిత్ర చెబుతోందన్నారు. ఆ సమయంలోనే ఆయన హనుమాన్‌, కోదండ రామాలయం నిర్మించారని వివరించారు. ఇప్పుడు ఆ ఆలయ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా ఈ తెలుగు శాసనం బయల్పడిందన్నారు. ఇది 1879 నాటిదని, జగదేవి, కస్తూరి రంగయ్యనాయుడు దంపతుల కుమారుడు లక్ష్మీనారాయణప్ప అనే వ్యక్తి ‘తులసి వనం’ అనే పేరుతో బృందావనం ఏర్పాటు చేసినట్టు శాసనంపై పేర్కొన్నారని తెలిపారు.