News

సర్వ విద్యా ప్రదాత హనుమంతుడు :శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి

70views

హనుమంతుడు సర్వ విద్య ప్రదాత అని బెంగుళూరు రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి పేర్కొన్నారు.హ‌నుమ‌జ్జ‌యంతిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల‌లోని నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామిజి అనుగ్రహ భాషణం చేస్తూ, పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు సకల విద్యలను సూర్యుడికి బోధించాడని, సూర్యుడు సకల విద్యలను హనుమంతుడికి బోధించినట్లు తెలిపారు హనుమంతుని సేవిస్తే సత్ప్రవర్తన, ధైర్యం యశస్సు , విజయం సిద్ధిస్తుందని స్వామీజీ చెప్పారు. హనుమంతుడు తిరుమలలో జన్మించి, బాల్యంలోనే సూర్యుని పండుగ భావించి తినబోయిన డైరీ సాలి అన్నారు. రామ రావణ యుద్ధంలో సంజీవిని తెచ్చేందుకు హనుమంతుడిని మాత్రమే శ్రీరాముడు పంపినట్లు తెలిపారు. అందుకు కారణం స్వయంప్రకాశాలైన సంజీవినిని గుర్తించేందుకు తెచ్చేందుకు సూర్య విద్య తెలిసి ఉండాలని అది ఒక హనుమంతుడికి మాత్రమే తెలుసునని వివరించారు.

అనంతరం ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ స్వామీజీని శాలువ శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు.