News

హనుమత్ జయంతి : తిరుమలలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు

106views

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో జూన్ ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు అంజనాద్రి ఆకాశగంగా ఆలయం, జపాలి తీర్థం లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

టీటీడీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు మొత్తం ఐదు రోజులపాటు ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించడంతోపాటు, జపాలీ తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహింస్తోంది. హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా అంజనాద్రి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు రోజులపాటు ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి 10 గంటల వరకు అభిషేకం నిర్వహించనున్నారు.

ఐదు రోజులు హనుమాన్ కు అభిషేకాలు ఇలా …….
మొదటి రోజు జూన్ 1వ తేదీన మల్లెపూలతో, జూన్ రెండవ తేదీన తమలపాకులతో, జూన్ మూడవ తేదీన ఎర్రగన్నేరు తో, కనకాంబరాల తో, జూన్ 4వ తేదీన చామంతి తో, చివరి రోజైన జూన్ 5వ తేదీ సింధూరంతో అంజనాద్రి శ్రీ బాలాంజనేయ స్వామి స్వామివారికి అభిషేకం చేస్తారు. అంతేకాదు పండితులచే శ్రీ ఆంజనేయ సహస్రనామార్చనల తో పాటు అత్యంత ఘనంగా మంత్రోచ్ఛారణల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు.