News

రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం

514views

ఆకాశంలో నుంచి భూమి పైనున్న లక్ష్యాలపైకి ప్రయోగించే రుద్ర ఎం-2 మిస్సైల్ భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి ఎసయూ-30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అందుకుందని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. రుద్ర ఎం-2 మిస్సైల్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. డీఆర్డీఓకు చెందిన పలు లాబోరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఇందులో వాడారు. నేలపై ఉన్న పలురకాల శత్రు లక్ష్యాలను చేధించేందుకు రుద్ర క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్ర ఎం-2ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్ర ఫోర్స్ క్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గ్ అభినందించారు. రుద్ర ఎం-2 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధబలగాల బలాన్ని రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు.