News

శిల్ప ఆగమ వాస్తు సదస్సు

86views

శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్టేట్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయోగ్ (సిత) కార్యాలయంలో 25, 26 తేదీల్లో శిల్ప ఆగమ వాస్తు సదస్సు జరిగింది. ఇందులో రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన శిల్ప. ఆగమ-వాస్తు పండితులు హాజరై ఆయా అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా శిల్ప కళాభారతి సంచాలకులు కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ప్రచురించిన ‘మనసార వాస్తు శాస్త్ర గ్రంథాన్ని ఆదివారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ, శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణా ధికారి కె.ఎస్. రామరావు ఆవిష్కరించారు. అనం తరం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ వాస్తు శిల్పం, రూపకల్పనపై ఉన్న ప్రాచీన సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువ దించిన డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు అభినందనీ యులన్నారు. ఆధ్యాత్మిక కళల్లో హస్త కళాకారుడు / కళాకారిణి సంప్రదాయ రీతుల్లో ఆధ్యాత్మికత, పవిత్రతను వ్యక్తపరుస్తూ కళాకృతు లను రూపొందిస్తారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో శిల్ప, ఆగమ, వాస్తు అంశాలపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు ఇచ్చిన సూచ నలు, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.