News

నైట్ విజన్ గాగుల్స్‌తో వాయుసేన అరుదైన ఫీట్

98views

భారత వాయుసేన (ఐఎఎఫ్) మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో తూర్పు సెక్టార్‌లో రవాణా విమానాన్ని వియవంతంగా ల్యాండ్ చేసింది. సి330 అధునాతన లాండింగ్ గ్రౌండ్‌లో దిగిందని వాయుసే ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించిన రెండు వీడియో క్లిప్‌లను షేర్ చేసింది. హార్‌కామ్ దేశ్ కే నామ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది.

ఈ ఎన్‌వీజీ సాంకేతికత సాయంతో తక్కువ వెలుగులో ఐఎఎఫ్ మరింత సమర్ధతతో ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుపడుతుంది. ఒక క్లిప్‌లో ఎన్‌వీజీ సాయంతో విమానం సజావుగా ల్యాండ్ కావడం కనిపించింది. ఎయిర్‌క్రాఫ్ట్ లోపలి నుంచి వ్యూ ఎలా ఉంటుందో మరో వీడియోలో పంచుకుంది.

“దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే ప్రక్రియలో భాగంగా మా సామర్థాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నాం” అని ఈ సందర్భంగా ఐఎఎఫ్ తెలిపింది.