News

మణిపూర్‌లో మెయితీల పవిత్ర పర్వతాన్ని ఆక్రమించిన కుకీ మిలిటెంట్లు

90views

మణిపూర్ రాష్ట్రంలో కుకీ నేషనల్ ఫ్రంట్ (మిలటరీ కౌన్సిల్) అనే కుకీ తీవ్రవాద సంస్థ ఒక పర్వత ప్రాంతాన్ని ఆక్రమించి, దాని పేరు మార్చేసింది. ఆ పర్వత ప్రాంతం మెయితీ తెగవారి పవిత్ర ప్రార్థనా ప్రదేశం కావడంతో వివాదం చెలరేగింది. మణిపూర్ ప్రభుత్వం కుకీ తీవ్రవాద సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంది.

మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా థాంగ్‌జింగ్ చింగ్ పర్వతప్రాంతాన్ని కుకీ నేషనల్ ఫ్రంట్ ఆక్రమించింది. అక్కడ ‘కుకీ ఆర్మీ క్యాంప్’ అని బోర్డు తగిలించింది. నిజానికి ఆ పర్వతం ‘సనమహిజం’ అనే మతధర్మాన్ని పాటించే మెయితీ తెగ వారి పవిత్ర పుణ్యక్షేత్రం. కుకీ ఆర్మీ క్యాంప్ అన్న బోర్డు తగిలించిన ఫొటో స్థానికంగా విస్తృత ప్రచారంలోకి రావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

మణిపూర్ భూవనరుల అధికారి మంగోలియావో కేమే, ఇంఫాల్ పోలీస్ స్టేషన్ అధికారికి మే 20న లేఖ రాసారు. ఆ లేఖలో, థాంగ్‌జింగ్ పర్వతప్రాంతం హెంగ్‌లెప్ పీఎస్ పరిధిలోకి వస్తుందనీ, అందువల్ల జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ రాసారు. ఆ పర్వతానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. అది చురాచాంద్‌పూర్ రక్షిత అటవీప్రాంతంలోని భాగం. మణిపూర్ ప్రాచీన, చారిత్రక ప్రదేశాలు, పురావస్తు స్థలాల పరిరక్షణ చట్టం పరిధిలో రక్షిత ప్రాంతంగా ఆ పర్వతాన్ని గుర్తించారు.

మెయితీలు ప్రధానంగా మణిపూర్ స్థానికతెగ కాగా కుకీలు బర్మా, తదితర ప్రదేశాలనుంచి భారత భూభాగంలోకి చొరబడినవారు. బ్రిటిష్ పాలన కాలంలో కుకీల్లో ఎక్కువమంది క్రైస్తవంలోకి మారిపోయారు. అయినప్పటికీ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కుకీలకు షెడ్యూల్డు తెగల రిజర్వేషన్ ఇచ్చి, మెయితీలకు ఇవ్వకుండా వదిలేసారు.