News

ఆర్టికల్‌ 370 రద్దు తీర్పుపై సమీక్షకు సుప్రీం నో

87views

జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన ఆర్టికల్‌ 370ను రద్దును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్షించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్టికల్‌ 370 రద్దు సబబేనని గత ఏడాది డిసెంబరులో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. దీనిని సమీక్షించాలని కోరుతూ పలు దరఖాస్తులు వచ్చాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్‌లోనే అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల పరిశీలించింది. తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదంటూ వాటిని తిరస్కరించింది. తమ పిటిషన్లపై ఓపెన్‌ కోర్టులో విచారణ జరపాలని, వాదనలకు అవకాశం కల్పించాలన్న వినతులను కూడా నిరాకరించింది. అవామీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ, సీపీఎం నాయకుడు మహ్మద్‌ యూసుఫ్‌ తారిగామి ఈ రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.