News

విద్య అంటే ర్యాంకులు, మార్కులు కాదు.. విజ్ఞాన సముపార్జన

87views

భావితరాల భవిష్యత్ విద్యపైనే ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. మానవాళి సమస్యలన్నింటికి విద్య ద్వారానే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. శాస్త్రీయమైన విద్యతోనే మానవ ప్రగతి ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. విద్య అంటే ర్యాంకులు, మార్కులే కాదన్నారు. విజ్ఞాన సముపార్జనే చదువు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మార్కుల కోసం ఒత్తిడి తీసుకురాకూడదని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మాత్రమే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఏ స్థాయికి చేరుకున్నా మూలాలు మరిచిపోవద్దని సూచించారు.