News

చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు

111views

విజయనగరంలోని కొత్తవలస సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. సీఐఐ ఫౌండేషన్‌ మైక్రో ఎంటర్‌ప్రైజస్‌ విభాగంలో ఉమెన్‌ ఎక్సెంప్లర్‌ అవార్డు-2024 వరించింది.ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సమ్మిట్‌లో ఆమెకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రదానం చేశారు. ట్రోఫీ, ధ్రువపత్రం, రూ.3 లక్షల నగదును అందజేశారు. విజయనగరం జిల్లాలో 20 వేల మంది మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించినందుకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 300లకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఆన్‌లైన్‌లో ముఖాముఖి నిర్వహించి, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల తీరును పరిశీలించి 16 మందిని ఎంపిక చేయగా.. అందులో సరస్వతి ఒకరు. ఈమె గృహహింస, లింగ వివక్షపై పోరాటాలు చేశారు. ఆహార భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎంపిక చేసినట్లు సీఐఐ పేర్కొంది.