
184views
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. రద్దీ కారణంగా ఆలయానికి వెళ్లే చిన్న కొండదారిలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇరుకైన దారిలో రెండు గంటలకు పైగా నిల్చున్నామని, రద్దీ నిర్వహణపై అధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదని శనివారం కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్షయ తృతీయ నేపథ్యంలో హిమాలయాల్లోని యమునోత్రి, కేదార్‌నాథ్, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. ఏటా వేసవిలో మొదలై శీతాకాలం ప్రారంభమయ్యే వరకు నిర్వహించే ఈ యాత్రలో లక్షలాది భక్తులు పాల్గొని నాలుగు ఆలయాలను సందర్శిస్తారు.





