వైయస్సార్ జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి వారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తిరు ణాల గురువారం సాయంత్రం ముగిసింది. రథోత్సవ వేడుకల సందర్భంగా రథంలో వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తుల విగ్రహాల ను శుభముహుర్తాన వేద పండితు లు అధిష్టింపచేశారు. ఈ సందర్భం గా భక్తులు గోవింద నామస్మరణలతో మార్మోగుతూ రథాన్ని ముందుకు కదిలించారు. మధ్యాహ్నం కొంత దూరం వరకు లాగి నిలిపి సాయంత్రం మళ్ళీ రథాన్ని యథాస్థానానికి లాగారు. ఈ తిరుణాలకు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటుగా కర్నాటకకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా గురువారం రాత్రి గరుడోత్సవ వేడుకలను నిర్వహించి స్వామి వారికి పూజలు చేశారు. తిరుణాలకు వచ్నిన భక్త్తులకు ఆలయ కమిటీ సిబ్బంది ఏర్పాట్లను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత దీపాలతో అలంకరించిన చాందినీ బండ్లను ఊరేగించి భక్తులు స్వామి వారిని దర్శించుకుని తలనీలాలను సమర్పించారు.
170views
You Might Also Like
మరో సైలెంట్ హంటర్ ఐఎన్ఎస్ మాల్వాన్
40
భారత నౌకాదళానికి మరో సైలెంట్ హంటర్ అందుబాటులోకి వచ్చింది. తీరప్రాంత రక్షణ కోసం స్వదేశీయంగా నిర్మించిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌక ఐఎన్ఎస్ మాల్వాన్ నేవీలో చేరింది. కొచ్చి...
తొలిసారిగా చంద్రుడి వద్దకు ఐఫోన్లతో వ్యోమగాములు.. నాసా కీలక నిర్ణయం
22
అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో చారిత్రక మార్పుకు శ్రీకారం చుట్టింది. చరిత్రలో తొలిసారిగా, లోతైన అంతరిక్షంలోకి (డీప్ స్పేస్) వెళ్తున్న తమ...
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు
24
భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని ఈ నేపథ్యంలో...
ఆస్తిని ‘వక్ఫ్’ అని పిలిచినంత మాత్రాన అది ప్రభుత్వానిది కాదు : మద్రాస్ హైకోర్టు
50
ఆస్తుల క్లెయిమ్‌లకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఏదైనా ఒక ఆస్తిని కేవలం 'వక్ఫ్' లేదా 'మసీదు' అని పిలిచినంత మాత్రాన లేదా...
ఐఎన్ఎస్ “తారాగిరి” నౌకజల ప్రవేశం
40
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నేవల్డాక్ యార్డ్ వేదికగా ఐఎన్ఎస్ "తారాగిరి” నౌకజల ప్రవేశం కార్యక్రమంలో...
మధ్యప్రదేశ్‌లోని గరౌలి గ్రామంలో 200 ఏళ్లుగా ‘తాటకి వధ’ వేడుకలు
44
విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి పదేపదే అడ్డుతగులుతున్న తాటకి అనే రాక్షసిని ఒకే ఒక్క బాణంతో భగవాన్ శ్రీరాముడు అంతం చేశారు. ఆ ఘట్టాన్ని, రామబాణం శక్తిని గుర్తు...





