211views
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్‌లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలునిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 20సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తామని వెల్లడించారు.





