News

సంస్కృతి గొప్పదనాన్ని నేటితరానికి తెలియజెప్పాలి

198views

మన సంస్కృతి, ఆచారాల గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజెప్పేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని విశ్వశ్రీ సాహితీ సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు అన్నారు. గంగవరంలోని కళా మందిరంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. విదేశాలకు వెళ్లినా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన మనందరిపై ఉందన్నారు. తెలుగువారి పండుగులకు, ప్రకృతికి సంబంధం ఉందని చెప్పారు. అనంతరం తమిళనాడు హోసూరుకు చెందిన అగరం వసంత్‌ రచించిన ‘కథమరిచిన మనిషి’, ‘తల్లివేరు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు.అలాగే వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 60 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను బహూకరించారు.