News

తిరుపతమ్మ భక్తులపై పోలీసు జులుం, భీమవరం గ్రామంలో ఉద్రిక్తత

354views

రంగుల మహోత్సవం పూర్తిచేసుకుని జగ్గయ్య పేట నుంచి పెనుగంచిప్రోలు బయల్దేరిన అమ్మవారి మండలంలో భీమవరం గ్రామానికి సోమవారం ఉదయం చేరుకుంది. ఈ సందర్బంగా గ్రామంలో ఊరేగింపు అనంతరం అంకమ్మ గుడి దగ్గర భక్తులు సందర్శనార్ధం కొద్ది సేపు ఉంచారు. ప్రతిసారి 3–4 గంటలు ఉంచి గ్రామస్తులు అంతా దర్శనం, పూజలు అయ్యాక లింగగూడెంకు తీసుకువెళ్లేవారు. ఈ సారి కొద్ది సేపు ఉంచి తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధం కావటంతో గ్రామస్తులు పల్లకీలకు అడ్డం తిరిగారు. ఈ సందర్బంగా పోలీసులు భక్తులపై చేయి చేసుకుని బలవంతంగా లాగి పారేయ్యటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భక్తులపై పోలీసులు దాష్టికాన్ని గ్రామస్తులు తీవ్రంగా నిరసించారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పటంతో అమ్మవారి యాత్ర సాగింది.