మహిళల భద్రత కోసం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఒకే ఒక్క బటన్ నొక్కితే.. రిజిస్టర్ అయిన్ మొబైల్ ఫోన్లకు అలెర్ట్ మెసేజ్‌తోపాటు చిత్రంతో కూడిన లొకేషన్ లింక్ క్షణాల్లో చేరుతుంది. చిన్నపాటి ఈ పరికరాన్ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని వెంట తీసుకెళ్లవచ్చని విద్యార్థినులు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీన అనకాపల్లిలో నిర్వహించిన ఉమ్మడి విశాఖ జిల్లాస్థాయి ‘ఇన్‌స్పైర్ అవార్డు-మనక్’ వైజ్ఞానిక ప్రదర్శనలో చింతపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన ప్రయోగానికి ప్రథమ స్థానం లభించింది. ఈ నెల 25న చిత్తూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఈ ప్రాజెక్టు ఎంపికైంది.

చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థినులు సాగిన భువన శృతి, అంజూర జ్యోత్స్నలు.. ఫిజిక్స్, బయాలజీ ఉపాధ్యాయులు జి.దాసు, జి.నాగేశ్వరరావుల సహకారంతో మహిళా భద్రతకు ఒక పరికరాన్ని రూపొందించాలని భావించారు. ఇందుకు అవసరమైన పరికరాలను ఉపాధ్యాయులు సూచించగా, సుమారు రూ.2 వేలతో వివిధ రకాల ఎలకా్ట్రనిక్ పరికరాలను కొనుగోలు చేశారు. వీటితో నాలుగు సెంటీమీటర్ల పొడవు, మూడు సెంటీమీటర్లు వెడల్పుతో, సిమ్ అమర్చి ఒక పరికరాన్ని తయారు చేశారు. దీనికి ‘ఉమెన్ సెఫ్టీ బ్యాగ్’ అని పేరు పెట్టారు. దీనికి సెల్ సిగ్నల్స్ వుంటే సరిపోతుంది. ఈ పరికరాన్ని మహిళలు/ యువతులు తమ హ్యాండ్ బ్యాగ్‌లో ఎవరికి కనిపించకుండా వెంట తీసుకెళ్లవచ్చు. ఆపద సమయంలో ఈ పరికరానికి కనెక్ట్ కాబడివున్న బటన్ నొక్కితే క్షణాల్లో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్లుకు అలెర్ట్ మెసేజ్ వెళుతుంది. మహిళ లేదా యువతి ఉన్న ప్రాంతం చిత్రంతో కూడిన లొకేషన్ లింక్ వస్తుంది. అలెర్ట్ మెసేజ్‌లో వచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఆమె ఉన్న కచ్చితమైన లొకేషన్, ఫొటో కనిపిస్తుంది. దీంతో వెంటనే మహిళను రక్షించేందుకు చర్యలు తీసుకునే అవకాశమున్నది.
మహిళలకు ఎంతో ఉపయుక్తం
సాగిన భువన శృతి, పదో తరగతి (17సీటీపీ4)
ఉమెన్ సేఫ్టీ బ్యాగ్ పరికరం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అగంతకులు ఎవరైనా మహిళలపై దాడి చేస్తే చిన్నపాటి బటన్‌ను ఒకసారి ప్రెస్ చేస్తే చాలు. ముందుగా పరికరంలో రిజిస్టర్‌చేసిన మొబైల్ నంబర్లకు అలెర్ట్ మెసేజ్, లొకేషన్ లింక్ వెళుతుంది. ఈ పరికరం పనిచేసేందుకు బ్యాటరీ చార్జింగ్, సెల్ సిగ్నల్స్ ఉంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్, ప్రత్యేక యాప్ అవసరంలేదు. ఈ పరికరం తయారీకి రూ.2 వేలు ఖర్చు అవుతుంది.
మొబైల్ నంబర్స్ రిజిస్టర్ చేసుకోవాలి
జి.దాసు, జి.నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు (17సీటీపీ5)
అత్యవసర సేవలు పొందేందుకు ఉమెన్ సేఫ్టీ బ్యాగ్ పరికరంలో ముందుగా కుటుంబ సభ్యులు, సమీపంలో వున్న మహిళా కానిస్టేబుల్, ఎస్‌ఐ, సీఐల మొబైల్ ఫోన్ నంబర్లను రిజిస్టర్ చేసుకోవాలి. గరిష్ఠంగా 20 ఫోన్ నంబర్ల వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. లోకేషన్‌తోపాటు ఆపదలో వున్న మహిళ ఎక్కడ వుందో ఆ ప్రాంతం ఫొటో లింక్ వస్తుంది. దీంతో మహిళను రక్షించడంతోపాటు దుండగులను సులభంగా పట్టుకోవచ్చు. చింతపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థినులు రూపొందించిన పరికరం అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది. ఈ పరికరం రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం సంతోషంగా వుంది.