News

జీఎస్‌ఎల్‌వీ అనుసంధానం పూర్తి

232views

జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్ర నుంచి ఈ నెల 17 వ తేదీ న జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు పేర్కొంది. ఆరోజు సాయంత్రం 5 గంటల 30నిమిషాలకు ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో సామాజిక మాధ్యమంలో తెలియజేసింది. ఈ మిషన్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహం వాతావరణ రంగంలో సేవలందించనుంది.