ArticlesNews

భారత్ బదల్ గయా… నయా భారత్ కా సప్నా సాకార్ కియా…

282views

 

  • భారత్ వేగంగా మారిపోతోంది.

  • రక్షణ రంగ సాంకేతికతను విదేశాలకు అందించగలిగేలా…. లక్ష్యాలను వేగంగా అధిగమిస్తూ….

  • 35 వేల కోట్ల ఎగుమతులే లక్ష్యంగా… వడివడిగా అడుగులు…

 

భారత్ దశాబ్దాలుగా రక్షణ పరికరాల దిగుమతిదారుగానే ఉంది. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) వారి లెక్క ప్రకారం 2014 – 18 మధ్య ప్రపంచవ్యాప్తంగా సౌదీ అరేబియా తర్వాత రెండవ అతి పెద్ద రక్షణ పరికరాల దిగుమతుదారు భారతే. ప్రపంచ వ్యాప్తంగా జరిగే రక్షణ పరికరాల దిగుమతిలో ఇది 9.5 శాతంగా ఉంది. భారత విదేశీ మారక నిల్వలలో సింహ భాగం ఆయుధ దిగుమతికే ఖర్చవుతోంది. ఇది విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి కలుగజేస్తోంది.

మొదటి విడత మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అనేక రంగాలతోబాటు రక్షణ రంగ ఉత్పత్తులను కూడా దేశీయంగా  తయారు చెయ్యడానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇప్పుడు అది సానుకూల ఫలితాల్ని ఇస్తోందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. రక్షణ ఉత్పత్తుల విభాగం సెక్రెటరీ అజయ్ కుమార్ మాట్లాడుతూ “ నా అంచనా ప్రకారం 2024 – 25 నాటికి 35 వేల కోట్ల లక్ష్యాన్ని అధిగమించవచ్చు” అని వెల్లడించారు.

గత ఆర్ధిక సంవత్సరంలో భారత ఎగుమతులు 10700 కోట్లు. అది 2019 – 20 ఆర్ధిక సంవత్సరంలో దాని లక్ష్యం  20 వేల కోట్లు కాగా మొదటి మూడు నెలల్లోనే 5600 కోట్ల ఎగుమతులతో లక్ష్యంలో నాల్గవవంతు దాటడం గమనార్హం. ఎగుమతులు ఇదే విధంగా సాగితే ఈ ఆర్ధిక సంవత్సర లక్ష్యం 20 వేల కోట్లు దాటడం కూడా కష్టం కాబోదు. “ రక్షణ ఉత్పత్తుల ఎగుమతి అనేది ఒక పెద్ద బండరాయిని అతి కష్టం మీద కదల్చటం లాంటిది. ఒక్కసారి దొర్లటం ప్రారంభిస్తే కేవలం ఆర్జనలే అనే స్థితి వస్తుంది.” అన్నారు అజయ్ కుమార్.

రక్షణ ఉత్పత్తుల ఎగుమతి 2016 – 17లో కేవలం 1500 కోట్లు కాగా, 2017 – 18లో 4500 కోట్లు. 2018 – 19లో అది 10 వేల కోట్లకు చేరగా 2019 – 20లో దాని లక్ష్యం 20వేల కోట్లు అంటేనే రక్షణ ఉత్పత్తులు, సేవల ఎగుమతికి ప్రభుత్వం ఎంత ప్రాదాన్యత, ప్రోత్సాహం ఇస్తోందో అర్ధం చేసుకోవచ్చు.

రెండవ విడత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం భారత రక్షణ దళాలకు కావలసిన ఆయుధ సామగ్రిని అందించటమే కాక ఎగుమతులపైన తీవ్రంగా దృష్టి సారించింది. ఈ సంవత్సరం బడ్జెట్లో 50వేల డాలర్లు కేవలం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెంచే పథకాలకు కేటాయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవకాశాలపై ఒక సమగ్ర నివేదిక కోరింది. ప్రపంచ వ్యాప్తంగా రక్షణ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్న దేశాలను A,B,C కేటగిరీలుగా విభజించి ఆ న్కేతగిరీల ప్రకారం డబ్బును కేటాయిస్తోంది. DPP – 2018  ప్రభుత్వ ముసాయిదా ప్రకారం ఫైటర్ జెట్లు, హెలికాఫ్టర్లతో కలిపి 2025 నాటికి 1.7 ట్రిలియన్ల (1,70,000 వేల కోట్ల) ఎగుమతుల లక్ష్యాన్ని ప్రభుత్వం  నిర్దేశించుకుంది.

ఈ ముసాయిదా 74 శాతం విదేశీ ప్రత్యక్ష నిధులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడం ద్వారా భారత్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో భారత్ ను రక్షణ, అంతరిక్ష రంగాలలో ప్రపంచంలోని 5 అగ్రగామి దేశాల సరసన చేర్చటం ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

Source : Ritam

https://m.ritam.app/Encyc/2019/7/15/defence-products-exports-india-01-.amp.html

తెలుగు అనువాదం : గజ్జెల మోహన్