News

ఫిబ్రవరి 15 నుంచి అయోధ్య రామాలయ నిర్మాణ పనులు పునః ప్రారంభం

226views

ఫిబ్రవరి 15 నుంచి అయోధ్య రామాలయ సముదాయంలో నిర్మాణ పనులను పున: ప్రారంభమవుతాయని ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా అన్నారు‌. ఆలయం మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇప్పుడు రెండో అంతస్తు, ఆపై అంతస్తుకోసం పనితిరిగి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. జనవరి 15 నుంచి రామజన్మభూమి కాంప్లెక్స్ లో కొనసాగుతున్న నిర్మాణ పనులు ప్రాణ్ ప్రతిష్ట వేడుకల కారణంగా నిలిపివేయడం జరిగింది. అయితే, తిరిగి ఫిబ్రవరి 15 నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించే ప్రక్రియ మొదలుకానుంది. ఆలయ సముదాయంలో అమర్చిన యంత్రాలను తిరిగి అమర్చే పని ప్రారంమైందని రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న మార్బుల్ నిపుణుడు, ప్రధాన విక్రేత రోహిత్ భాటియా తెలిపారు.