News

శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చినట్టు రోగాలు తగ్గించే పాస్టర్ హాస్పిటల్ పాలు.

286views

నకు మానవాతీత శక్తులున్నాయని, తన ప్రార్ధనలతో భక్తుల రోగాలు తగ్గిస్తానని చెప్పుకునే ఒక క్రైస్తవ మతాధికారి వైరల్ ఫీవర్ కారణంగా తానే ( ఈ నెల 8 న) కేరలోని అలప్పుజాలో హాస్పిటల్ పాలైన ఘటన ఆసక్తిని రేపుతోంది.

ఫాదర్ వి.పి. జోసెఫ్ వలియవీట్టిల్ అనే ఒక క్రైస్తవ ఫాదరీ కేరళలోని అలప్పుజాలో “కృపాసనం మారియన్ రిట్రీట్ సెంటర్” పేరుతో ఒక స్వస్థత కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈయనకు మానవాతీత శక్తులున్నాయని, తన ప్రార్ధనలతో భక్తుల రోగాలను నయం చేస్తాడని నమ్మే భక్తులకు అక్కడ కొదవేమి లేదు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వచ్చి ఆయన చేసే ప్రార్ధనలతో తమ రోగాలు నయమౌతాయని నమ్మేవారు.

కానీ ఈ నెల 8న తీవ్రమైన జ్వరంతో ఆయనే హాస్పిటల్ పాలయ్యారు. “తన ప్రార్ధనల ద్వారా రోగులకు నయం చెయ్యడానికి ఆయన అవిశ్రాంతంగా శ్రమించినందున ఆయనకు జ్వరం వచ్చింది. అప్పటికీ ఆయనను విశ్రాంతి తీసుకోవలసిందిగా కోరాం. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. పోనీలెండి ఈ రూపంలోనైనా ఆయనకు విశ్రాంతి లభించింది.” అని ఆ స్వస్థత కేంద్రం డైరెక్టర్ తంకచన్ పానకల్ చెప్పారు. కేరళ రాష్ట్రమంతటా ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తూండడం గమనార్హం.

కాగా ఇటీవల ఈ సంస్థ నడిపే “పత్రిక పేజీలను ఉపయోగించి కూడా రోగాలు నయం చేసుకోవచ్చు” అని ఆ పత్రికలో ఇచ్చిన ఒక ప్రకటనపై కోర్టులో వివాదం కూడా నడిచింది. దాంతో సదరు ఫాదరు గారు భక్తులు రోగాలు నయం చేసుకోవడానికి పత్రిక పేజీల తాలూకు బూడిదను వాడడానికి బదులుగా రోగ విముక్తికై తమ కేంద్రానికే రావాలని భక్తులకు విజ్ఞప్తి చేసిన కొద్ది రోజులకే సాక్షాత్తు ఫాదరు గారే హాస్పిటలు పాలు గావడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానిస్తున్నారు.