News

యూపీలోని బిజ్నూర్లో మదర్సాపై పోలీసుల దాడి – పెద్ద ఎత్తున మారణాయుధాలు లభ్యం.

434views

ఒక మదర్సాపై పోలీసులు చేసిన దాడిలో పేలుడు పదార్ధాలతో సహా ఇతర ఆయుధాలు లభ్యమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ జిల్లా షేర్కోట్లో చోటు చేసుకుంది.

జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కొందరు మదర్సాను తరచుగా సందర్శిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు బిజ్నూర్లోని దారుల్ ఖురాన్ హమిదియా మదర్సాపై ఆకస్మికంగా దాడి చేసి ఘటనతో సంబంధం ఉన్నఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కనోజియా మాట్లాడుతూ “మదర్సా కేంద్రంగా కొందరు వ్యక్తులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా సమాచారం అందుకున్న మేము మదర్సాపై దాడి చేసి 5 పిస్తోళ్ళను, అనేక క్యాట్రిడ్జ్ లను, పేలుడు పదార్థాలను  స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్టు చేశాం” అని చెప్పారు.

అరెస్టయిన వారిలో అదే మదర్సాలో గతంలోపని చేసిన ఉపాధ్యాయుడు కూడా ఉండడం గమనార్హం. ఆ మదర్సాలో 25 మంది విద్యార్థులుండగా వారిలో 14 మంది బీహార్ కు చెందిన వారే కావడం గమనార్హం. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు మీడియాకు తెలిపారు.