
పూరీ జగన్నాథ యాత్ర సందర్భంగా అద్భుతం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది భక్తులు పక్కకు తప్పుకొని ఓ అంబులెన్స్‌కు దారిచ్చారు. కిక్కిరిసిపోయిన భక్తుల మధ్య జరిగిన రథయాత్ర కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎస్పీ పూరీ’ అనే ట్విటర్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉందని చాటి చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పూరీ రథయాత్ర కోసం 1200 మంది వాలంటీర్లు, 10 స్వచ్ఛంద సంస్థలు పనిచేశాయి. వీరంతా గంటల తరబడి శ్రమించడం వల్లే ఈ మానవహారం సాధ్యమైందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఆ వాలంటీర్లలో 500 మందికి పైగా ఆరెస్సెస్ స్వయంసేవకులు ఉండడం గమనార్హం. పూరి రథయాత్ర సందర్భంగా ఆరెస్సెస్ స్వయంసేవకులు అందించిన సేవలను భక్తులు శ్లాఘిస్తున్నారు.





