News

ఆలయంలోకి రాళ్లు రువ్విన మతోన్మాదులు

236views

చిత్తూరుజిల్లా పుంగనూరులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి రాళ్లు రువ్వారు. ఈ ఘటన పుంగనూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఆకతాయిలు ద్విచక్ర వాహనాలపై వచ్చి స్థానిక ఎన్‌ఎస్‌పేట రామ్‌నగర్‌లోని శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలోకి రాళ్లు రువ్వారు. గమనించిన స్థానికులు వెంట పడటంతో పరారయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకుని పరిశీలించి ఫిర్యాదు ఇవ్వాలని కోరారు.

ఘటనకు నిరసనగా హిందూ జాగరణ సమితి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆకతాయిలను వెంటనే అరెస్టు చేయాలని సీఐ రాఘవరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని, మతోన్మాదులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలు కాపాడాలన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు.