News

గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు

170views

గణతంత్రదిన వేడుకల్లో భారత సైనికులతో కలిసి కర్తవ్య పథ్ కవాతు చేసే ఫ్రెంచి సైనిక బృందంలో ఆరుగురు భారతీయులు ఉంటారని అధికారులు వెల్లడించారు. శుక్రవారం జరగనున్న ఈ ఉత్సవాల్లో క్షిపణులు, డ్రోన్ జామర్, నిఘా వ్యవస్థలు, ఎక్కువగా మహిళలు కేంద్రంగా గల పదాతిదళ వాహనాల వంటి స్వదేశీ ఆయుధాలు, సైనిక ఉపకరణాలను భారత్ ప్రదర్శించనుంది. మొట్టమొదటిసారిగా మొత్తం మహిళలతో కూడిన త్రివిధ సేవల దళాలు ఈ ఉత్సవాల్లో భాగం కానున్నాయి.

అలాగే గతేడాది తొలిసారిగా ఫిరం గుల దళంలో నియమితులైన 10 మంది మహిళా అధికారుల నుంచి లెఫ్టినెంట్లు దీప్తి రాణా, ప్రియాంక సెవ్దా కవాతులో స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్, పినాక రాకెట్ సిస్టంలకు సారథ్యం వహిస్తారు. కవాతులో 80 శాతం కార్యకలాపాలు మహిళల చేతుల మీదుగానే జరుగుతాయని మేజర్ జనరల్ సుమిత్ మెహతా తెలిపారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు. మెక్రాన్ భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటున్న ఆరో ఫ్రెంచ్ నేత కానున్నారు. ఫ్రాన్స్ నుంచి వచ్చే 95 మంది సభ్యులు గల కవాతు దళం, 33 మందితో కూడిన వాయిద్య దళం కవాతులో పాల్గొంటాయి. ఫ్రెంచి రఫేల్ ఫైటర్లు, వాయుసేన విమానాలు వేడుకల్లో భాగమవుతాయి.