
314views
రాముడు ధర్మం, త్యాగనిరతికి ప్రతీక అని 500 ఏళ్ల తర్వాత మళ్లీ రామ్ లల్లా అయోధ్యకు తిరిగి వచ్చారని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ తెలిపారు. రామ్ ఈ యుగానికి చెందిన చరిత్రకు చాలా శక్తి ఉందని, రామ్ లల్లా కథలు విన్నవారు తమ బాధలు, సమస్యలు నుంచి విముక్తి పొందుతున్నారని ఆయన చెప్పారు.రాముడిని కోట్ల గళాలు స్మరించాయని రామ్‌లల్లాతో పాటు భారత స్వరం కూడా తిరిగివచ్చినట్లు భాగవత్ తెలిపారు.రాముడి త్యాగానికి, పరిశ్రమకు నమస్సులని సమన్వయం చేసుకుని ముందుకెళ్లడమే మన ధర్మం పేర్కొన్నారు. కొత్త భారత్ ఉద్భవించిందని చెబుతూ ఇవాళ జరిగిన కార్యక్రమమే దీనికి ప్రతీక అని వెల్లడించారు.





