
‘‘500 ఏళ్ల కల నెరవేరింది. అనుకున్న చోటే రామాలయం నిర్మించామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైంది. ఈ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. ప్రాణప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారింది. త్రేతాయుగంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతుంది. మోదీ దూరదృష్టి, అంకితభావంతోనే ఇదంతా సాధ్యమైంది. అయోధ్యకు పూర్వవైభవం తెచ్చేందుకు రూ. వందల కోట్లు కేటాయించారు. రాముడు మనకు ఓర్పు బోధించారు. ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను తిలకించిన ఈ తరం ఎంతో అదృష్టవంతులు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రామరాజ్యాన్ని సాకారం చేస్తుంది. ఇందులో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు’’ అని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.తన ఆలయం కోసం సాక్ష్యాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చిందన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించామని తెలిపారు.
కాగా అభిజిత్ ముహూర్తంలో రాముడు తొలి దర్శనం ఇచ్చారు. పసిడి కిరీటం, పట్టువస్త్రం, ముత్యాల కంఠాభరణంతో రాముడిని సుందరంగా అలంకరించారు. రమణీయంగా రామయ్య ప్రాణ ప్రతిష్ట మహోజ్వల ఘట్టం జరిగింది.రామ్‌లల్లాలకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు.అయోధ్య రామాలయంపై హెలికాప్టర్‌తో పూలవరషం కురిపించారు. సామాన్య భక్తులకు రేపటి నుంచి దర్శనం ఖరారైంది. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు బాలరాముడి దర్శించుకోవచ్చు. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచిరాత్రి 7 గంటల వరకు దర్శన అవకాశం కల్పించారు.





