News

నేత్రపర్వంగా శ్రీక్షేత్ర కారిడార్‌ ప్రారంభ వేడుక

292views

పూరీ శ్రీక్షేత్ర పరిక్రమణ మార్గం(కారిడార్‌), శ్రీసేతు నిర్మాణాల ప్రారంభ వేడుక, శ్రీమన్నారాయణ మహాయజ్ఞం బుధవారం కనుల పండువగా నిర్వహించారు. భక్తుల జయజయ ధ్వానాలు, శంఖధ్వని, భజన కీర్తనలతో పూరీ బొడొదండొ మార్మోగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌ దేవ్‌లు సంయుక్తంగా కారిడార్‌ నిర్మాణాలు ప్రారంభించి భక్తులకు అంకితం చేశారు. తర్వాత మహా యజ్ఞానికి జగన్నాథుని ప్రథమ సేవకుడు గజపతి పూర్ణాహుతి చేశారు. కనులపండువగా సాగిన ఈ వేడుకలో మంత్రులు, ఉన్నతాధికారులు, సిద్ధయోగులు, దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.