
పుణ్యక్షేత్రాల సందర్శనార్ధం వెళ్లే యాత్రికుల సౌకర్యార్ధం ఐఆర్‌సీటీసీ సంస్థ జ్యోతిర్లింగ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. ఈ రైలు ఈ నెల 23వ తేదీ సికింద్రాబాద్‌లో బయల్దేరి విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి తదితర ప్రాంతాలను సందర్శించనుంది. 31న రైలు తిరుగు ప్రయాణమవుతుంది. టీ, టిఫిన్, భోజనం, ఏసీ, నాన్ ఏసీ హోటల్ రూమ్స్‌తో కలిపి‡ టికెట్టు ధర ఒక్కొక్కరికీ సీప్లర్‌లో రూ.14,100, థర్డ్ ఏసీలో 21,500, సెకెండ్ ఏసీలో 27,900 ఉంటుంది. టికెట్ల బుకింగ్ ఇతర వివరాలకు ఫోన్ నెంబరు 92814 95848లో సంప్రదించాలి.
హైదరాబాద్ నుంచి థాయిలాండ్‌కు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 3 రాత్రులు, 4 పగలుతో గల ప్యాకేజీలో ఫిబ్రవరి 14న విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి బ్యాంకాక్ చేరుకుంటుంది. 17న తిరుగు ప్రయాణమవుతుంది. టికెట్టు ధర రూ.56,845. టికెట్ల బుకింగ్‌కు ఫోన్ నెంబరు 9281495848లో సంప్రదించవచ్చు.





