
235views
అలిపిరి వద్దనున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద ఉన్న అహ్నిక మండపం పునర్నిర్మాణంపై కేంద్ర పురావస్తుశాఖ సలహాలు, సూచనలు అందించాలని టీటీడీ రాసిన లేఖలపై ఎట్టకేలకు ఆశాఖ అధికారులు స్పందించారు. కట్ట డాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో కేంద్ర సాంస్కృతిక శాఖ అదనపు కార్యదర్శి రంజన్ చోప్రా దృష్టికి పైవిషయాన్ని తితిదే ఈవో ఏవీ ధర్మా రెడ్డి తీసుకెళ్లారు. స్పందించిన కేంద్ర పురావస్తుశాఖ తితిదే కట్టడాలు పునరుద్ధరించేందుకు సూచనలు చేసేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సర్కి ళ్లకు చెందిన అధికారులతో కమిటీని ఏర్పాటుచే సింది. ఈనెల 17, 18న కమిటీ పరిశీలన జరిపి తితిదేకు సూచనలు అందించనుంది.





