News

శ్రీకాళహస్తిలో రాములవారి అక్షింతల శోభయాత్ర

270views

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికీ అయోధ్య రామ మందిరం నుంచి తీసుకువచ్చిన రాములవారి అక్షింతలను శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌, విశ్వ హిందూ పరిషత్‌ సభ్యులు జి.రమేష్ బాబు ఆధ్వర్యంలో రామభక్తులు శోభయాత్రగా తీసుకొనివెళ్లి అయోధ్య రాముని అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు కన్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈనెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి, అక్షింతలను దేవుని వద్ద ఉంచి, కుటుంబసభ్యులపై చల్లుకొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని స్థానికులకు తెలియజేశారు. 22వ తేదీ అయోధ్యలో జరిగే రామయ్య విగ్ర ప్రాణ ప్రతిష్ట మహోన్నత కార్యక్రమాన్ని ప్రచారం చేసి మాధ్యమాల ద్వారా తిలకించి రాములవారి నామకీర్తన చేస్తూ, రామజ్యోతిని భక్తి శ్రద్ధలతో వెలిగించి, రామయ్య ప్రతిష్ట వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని కోరారు.