
338views
తిరుపతి, ఇతర ప్రాంతాల్లో గల టీటీడీ స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించేదిశగా అన్ని వివరాలతో ఆధునీకరించిన వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.
టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్ ను ఆధునీకరించింది.





