News

దేశవ్యాప్తంగా దేవాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు : తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్

252views

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వరకు అన్ని దేవాలయాలను శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు.రామ భక్తులు, హిందువులు సహా భారతీయులందరూ ఇందులో పాల్గొనాలంటూ రాయ్​ ఎక్స్​లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

“ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22 మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయం సీవాక్ సంఘ్​ సర్​సంఘ్​చాలక్​ మోహన్ భాగవత్, ఉత్తర్​ప్రదేశ్ గవర్నర్​ ఆనందీబెన్​ పటేల్​, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సమక్షంలో ఈ కార్యక్రమం జరగుతుంది. సుమారు 4,000 మంది సాధువులు ఇందులో పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ రోజు ఉదయం 10 గంటలకు ఆలయాల్లో భజనలు చేయాలని కోరుతున్నాను. ఆలయ యాజమాన్యాలు ఈ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేసేలా ఏర్పాటు చేయాలి. రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం హారతి ఇచ్చాకే అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలి. వారి ఆర్థిక పరిస్థితికి తగ్గట్లుగా ప్రసాద పంపిణీ చేయాలి. సాయంత్రం ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించాలి.”
-చంపత్​ రాయ్​, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి