
253views
సీఎం జగన్ ప్రజల సొమ్ముకు సమాధానం చెప్పరని, దేవుడి సొమ్ము కూడా దోచేస్తున్నారని బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కోనసీమ పర్యటనకు వచ్చి ఆమె అమలాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిటిడీ ఛైర్మన్‌గా అన్యమతస్థుడిని నియమిస్తే, భక్తుల విరాళాలు దారి మళ్లిస్తే బిజేపి మాత్రమే ప్రశ్నిస్తోందన్నారు. టిటిడీ బోర్డు పరిధిలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసినవారికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై ఓ పక్క వేంకటేశ్వరస్వామి చిత్రం.. మరోపక్క జగన్‌మోహన్‌రెడ్డి చిత్రం ముద్రించడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేమన్నా నీ ఆస్తా… దేవుడితో నీకు పోలికా.. అని మండిపడ్డారు.




