
220views
ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌లో గల మనోహర్ గోశాల నిర్వాహకులు గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ రూపొందించారు. ఆయుర్వేద హితామహుడు చరకుడి ప్రేరణతో తయారుచేసిన ఈ తివాచీని ప్రధానమంత్రికి కానుకగా పంపనున్నారు. ‘‘ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోడానికి చరకుడు ఇలాంటి తివాచీని వాడారు. 14 కిలోలకు పైగా బరువు ఉన్న దీన్ని తయారుచేయడానికి సౌమ్య కామధేను జాతికి చెందిన ఆవుపేడ, మూత్రాన్ని వినియోగించాం. గోల్డెన్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన ఈ రకం ఆవులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. త్వరలోనే ఢిల్లీలోని ప్రధాని నివాసానికి ఈ తివాచీని పంపుతాం’’ అని మనోహర్ గోశాల మేనేజింగ్ ట్రస్టీ పాదం డాక్‌లియా తెలిపారు.





