News

కాశ్మీర్ లో ఉగ్రమూకల చేతికి చైనా ఆయుధాలు

277views

జమ్మూకశ్మీర్లో ఉగ్ర మూకలకు చైనా నుంచి ఆయుధాలు అందుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. చైనా నుంచి తొలుత పాకిస్థాన్ సైన్యానికి.. తర్వాత అక్కడి నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), జమ్మూకశ్మీర్లకు అవి చేరుకుంటున్నట్లు తేలింది. ఇలా వస్తున్నవాటిలో ఆయుధాలతోపాటు డ్రోన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ సాధనాలు కూడా ఉంటున్నాయి. ఈ ఏడాది జమ్మూకశ్మీర్ లో జరిపిన దాడుల్లో ముష్కరులు వీటిని వాడారు. చైనా సాంకేతికతతో తయారైన స్నైపర్ తుపాకులను వారు ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత నవంబర్లో కశ్మీర్లోకి చొరబాటుకు యత్నిస్తున్న సమయంలో పాక్ వైపు నుంచి ఓ ఉగ్రవాది స్నైపర్తో కాల్పులు జరిపాడు. ఈ ఏడాది జరిగిన మూడు భారీ ఉగ్రదాడుల్లో ముష్కరులు చైనా తయారీ బాడీసూట్ కెమెరాలను ఉపయోగించారు. బీజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఎనిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా వారి చేతిలో ఉన్నాయని నిర్ధారణ అయింది.