
211views
కేరళలోని ఈ నెల 25 వరకూ శబరిమలను 31,43,163 మంది దర్శించుకున్నారని, 7,25,049 మందికి అన్న దానం నిర్వహించినట్లు వెల్లడించింది. బుధవారం నిర్వహించే పవిత్ర మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు చేసింది. పూజ అనంతరం అదే రోజు రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, మకరవిలక్కు పూజల కోసం 30న తిరిగి తెరవనున్నారు.శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం ఈ సీజన్లో రూ. 200 కోట్లు దాటింది. ఈ నెల 25 వరకు(గత 39 రోజులది) రూ.204.30 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. ఇందులో భక్తులు సమర్పించిన నాణేల ద్వారా రూ.63.89 కోట్లు, అరవణ ప్రసాదం విక్రయంతో రూ.96.32 కోట్లు, అప్పం ప్రసాదం విక్రయం ద్వారా రూ.12.38 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. భక్తులు సమర్పించిన నాణేలను పూర్తిగా లెక్కిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని తెలిపింది.




